ఓటమి భయంతోనే  ఈవీఎంలపై ఆరోపణలు

పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు జిమ్మిక్కులు

వైయస్‌ఆర్‌సీపీకి 130 సీట్లు ఖాయం

వైయస్‌ఆర్‌సీపీ పాణ్యం అభ్యర్థి కాటసారి రాంభూపాల్‌రెడ్డి

కర్నూలు: వైయస్‌ఆర్‌సీపీ ప్రకటించిన నవరత్నా పథకాలు ప్రజలను ఆకర్షించాయని వైయస్‌ఆర్‌సీపీ పాణ్యం అభ్యర్థి  కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని,అందుకే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.వైయస్‌ఆర్‌సీపీ 130 సీట్లుతో భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు.లగడపాటి సర్వేను ప్రజలు నమ్మరని తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని  జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 14 నెలలు ప్రజలతో మమేకమై పాదయాత్ర ద్వారా ప్రజాసమస్యలు తెలుసుకున్నారని తెలిపారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో న్యాయం జరుగుతుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.

 

Back to Top