సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఎన్ఆర్ఐలు

దుబాయి్‌లో థ్యాంక్యూ సీఎం కార్య‌క్ర‌మం

ముఖ్య అతిథిగా హాజ‌రైన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

వైయ‌స్ఆర్ జిల్లా: మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయం చేసిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్ఆర్ఐలు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  దుబాయిలో నిర్వహించిన థాంక్యూ సీఎం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పాల్గొని ప్ర‌సంగించారు. పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు అదనపు భారం పడకుండా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్ది నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు.  ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ థాంక్యూ సీఎం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా  మాట్లాడుతూ.. హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్గేషన్ ద్వారా ఒక్కొక్కరికి 80 వేల రూపాయలు అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి , విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇతర అధికారులను తనతో పాటు ఎంపీ మిధున్ రెడ్డిలు కలిశామని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడంతో... వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులపై అదనపు భారం పడకుండా 80 వేల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. త‌క్ష‌ణ‌మే రూ. 14.15 కోట్ల రూపాయలు ను విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి సీఎం రుజువు చేశారన్నారు.   సమావేశంలో డాక్టర్ భూ అబ్దుల్లా, యువ నేత షేక్ ఉమైర్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top