సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

 అమరావతి: యూఎన్‌డీపీ భాగస్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై మానిటరింగ్‌ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ అంశంపై నీతి ఆయోగ్‌ సభ్యుల బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్‌ (ఐఏఎస్‌), చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్, యూఎన్‌డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, నీతి ఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్స్‌ అలెన్‌ జాన్, సౌమి గుహ, యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ రిప్రజెంటేటివ్‌ డెన్నిస్‌ కర్రీ పాల్గొన్నారు. 

Back to Top