నవరాత్రి బ్రహ్మోత్సవాలు..సీఎం వైయస్‌ జగన్‌కు ఆహ్వానం

 అమరావతి: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు ఆహ్వాన ప‌త్రిక అందించారు.  ఉపముఖ్యమంత్రి(దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ,ఎమ్మెల్యే మల్లాది విష్టు, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం హరి జవహర్‌లాల్, దుర్గగుడి ఈవో డి భ్రమరాంబ, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. అనంత‌రం ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు  వేదపండితులు అంద‌జేశారు. 
దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవోలు ఆహ్వానించారు.

25 నుంచి శ్రీ‌శైలంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు
ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీశైలంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ  సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు ఆహ్వానపత్రిక అందించారు. 

 

తాజా వీడియోలు

Back to Top