న్యూఢిల్లీ: విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అ«ధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసిన వైయస్సార్‌సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.