అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన

గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా నరసరావుపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, యేసురత్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా నేతలు మాట్లాడుతూ..చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం ఎందుకు జోలె పట్టలేదని నిలదీశారు. అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. 

Back to Top