సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నంద‌మూరి కుటుంబీకులు

పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్న సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, నంద‌మూరి కుటుంబ స‌న్నిహితులు, నిమ్మ‌కూరు గ్రామ‌స్తులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు స్వ‌ర్గీయ‌ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) పేరు పెడతాన‌ని, స్థానికుల అభ్య‌ర్థ‌న‌ మేర‌కు పాద‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, నిమ్మ‌కూరు గ్రామ‌స్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళీ, పలువురు నిమ్మ‌కూరు గ్రామ‌స్తులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top