చంద్రబాబూ..ప్రజాస్వామ్యానికి ఏం ప్రమాదమొచ్చింది?

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి

చివరి నిమిషంలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర

ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఎన్నికలు జరగాలి

ఈసీకి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేఖ

 

అమరావతి: ప్రజాస్వామ్యానికి ఏదో ప్రమాదం  వచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని, అసలు ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏంటని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. చివరి నిమిషంలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగకుండా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కలిశారు. అనంతరం ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  ప్రజాస్వామ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే వాటిని తప్పుపట్టడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యానికి ఏం ప్రమాదం వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు.  వైయస్‌ వివేకానందరెడ్డి హత్యా విషయంలో కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. నేను ఏది చేసిన అదే తత్వం, వేదం అనుకోవడం చంద్రబాబుకు సరికాదన్నారు. ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు.

మే 23వ తేదీ రాబోయే ఫలితాల గురించి చంద్రబాబు ముందే భయపడుతున్నారన్నారు. ఎన్నికల నిబంధనలను టీడీపీ అధ్యక్షుడుగా పాటించాలన్నారు. ముఖ్యమంత్రిగా అప్రజాస్వామ్యిక చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. ఓటర్లు బాధత్యగా ఓట్లు వేయాలని కోరారు. మంచి వాతావరణంలో ఓటర్లు తమ ఉద్దేశాన్ని తెలియజేయాలని కోరారు. గత ఐదేళ్ల పాలన కాలంలో మాట్లాడిన ప్రతి మాట..ఇవాళ ఎన్నికల సమయంలో మాట్లాడుతున్న తీరు పొంతన లేదన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాలతో పాలన సాగించారన్నారు. ఎన్నికల సంఘం మెట్ల మీద ముఖ్యమంత్రిగా ధర్నా చేయడం దుర్మార్గమన్నారు. నిన్న 6.10 గంటలకు ముఖ్యమంత్రి లెటర్‌ ఫ్యాడ్‌గా ప్రజలకు లేఖ రాశారన్నారు. ముఖ్యమంత్రి లెటర్‌ ఫ్యాడ్‌పై ఎన్నికల అధికారులకు లేఖ రాశారని, ఎన్నికల నియమావళిని చంద్రబాబు పాట్టించడం లేదన్నారు. అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు తీరుపై ఎన్నికల సంఘం సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేయాలని కోరారు. ఎన్నికలకు మూడు నెలల ముందు కొంత మంది అధికారులకు చంద్రబాబు  ప్రత్యేకంగా పదోన్నతి కల్పించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో వారు టీడీపీ ఏజెంట్లుగా పని చేసేలా నియమించారని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల సంఘం కొద్ది మంది అధికారుల ప్రవర్తన సరిగా లేదని చర్యలు తీసుకుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ప్రశ్నించారన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు సవాలు చేశారని తెలిపారు. గతంలో చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే అప్పుడు కూడా అధికారులపై చర్యలు తీసుకున్నారని, అప్పట్లో వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ అంశంగా మాట్లాడలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారుల బదిలీని రాజకీయ అంశంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. అన్ని సవ్యంగా జరుగుతున్న సమయంలో మీ ఆందోళన ఏంటని నిలదీశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.
 

Back to Top