సీఎం సారు..మీ  కృషిలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు

వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి

తాడేప‌ల్లి: రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని తలంపుతో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు మీ కృషిలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్య‌క్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు.  త‌న‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్య‌క్షులుగా మ‌రోసారి నియ‌మించ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేస్తూ ముఖ్య‌మంత్రికి, పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఒక జీవితకాల రైతు ప్రతినిధిగా పనిచేసిన నాకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షునుగా తిరిగి నియమించి, పార్టీ అవిర్భావము నుంచి కొనసాగిస్తున్నందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఒక బిడ్డగా అభిమానించి సలహాలిచ్చిన శ్రీమతి వై.ఎస్. విజయమ్మ గారికి మరియు అనుబంధ విభాగాల ఇంచార్జ్ అయిన శ్రీ వి. విజయసాయి రెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి, టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారికి వీరు నన్ను ఒక సోదరుడులా ఆదరించి పోత్సహించినందుకు ధన్యవాదాలు. నేను ఎక్కడికి వెళ్ళిన ఆధరించిన పార్టీ ప్రముఖ నాయకులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు ముఖ్యంగా రైతు సోదరులకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు.

వ్యవసాయ శాస్త్రములో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, రైతుగా, రైతు ప్రతినిధిగా, దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పాలక సభ్యునిగా పనిచేసిన నాకు మే 30 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, జూన్ 07 రాష్ట్ర మంత్రి వర్గం ఏర్పాటు చేసిన తరువాత, అదే నెలలోనే రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చైర్మన్, అత్యున్నతి సలహామండలి ఏర్పాటు చేసే దానికి వైస్ చైర్మన్ గా ఒక కృష్ణా జిల్లా రైతునైన నన్ను నియమించడం ఒక శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యము.

ఇప్పటికే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే, శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు కూడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని తలంపుతో అహర్నిశలు కష్టపడుతున్న మీరు, మీ కృషిలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే 2 సంవత్సరాల్లో మరింత బాధ్యత యుతంగా నడవలిసిన విషయము తెలిసిందే. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ముఖాముఖి చర్చా గోష్ఠి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే, అనంతపురం, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేపట్టడము జరిగింది. ఇవాళ 29.06.2022న నంద్యాల్లో ముఖాముఖి చర్చ జరపబడింది.

ఈ రాబోయే 2 సంవత్సరాల్లో నాకు మరింత అత్మస్థైర్యాన్ని అందించి రైతు సోదరులకు పని చేసేలా తోడ్పాటు అందించమని పార్టీ నాయకులకు, రైతు సోదరులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఒక రైతు ప్రతినిధిగా నా ప్రయాణము కడవరకు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారితోనే వుంటుంది అని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇంతటి స్థానాన్ని కల్పించి మరియు ప్రజల్లో గుర్తింపు కలిగించినందుకు మరోక సారి వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

యం.వి.ఎస్.నాగిరెడ్డి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top