విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మైనారిటీల పక్షపాతి అని మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. హజ్ యాత్రికులకు రూ. 14.51 కోట్ల ప్రత్యేక ఆర్ధిక సహాయం చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ముస్లిం మైనారిటీలు కృతఙ్ఞతలు తెలిపారు. బుధవారం విజయవాడ నగరంలో ముస్లిం మైనారిటీలు సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక పంజా సెంటర్ వద్ద గల షాజహూర్ ముసాఫిర్ ఖానా లో ఎన్టీఆర్ జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న మైనారిటీ సోదరులకు వాక్సినేషన్, యాత్ర నియమ నిబంధనలు తెలిపేందుకు రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజాం, ఎన్టీఆర్ జిల్లా వై యస్ ఆర్ సిపి అధ్యక్షులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు , శాసన మండలి సభ్యులు ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ముందుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మైనారిటీల పక్షపాతి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు గన్నవరం నుండి బయలుదేరు 18వందల 13 మంది యాత్రికులకు అదనంగా పడే 14 కోట్ల 51 లక్ష రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ఆర్ధిక సహాయం కింద ప్రతి యాత్రికుల అకౌంట్లో నేరుగా జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ జిల్లా మైనారిటీల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ఆర్ధిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేశారని తెలిపారు. పవిత్ర హజ్ యాత్రను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం హేయమని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు గౌస్ మొహిద్దీన్ , కార్పొరేటర్లు అబ్దుల్ అర్షద్ అకీబ్ , షైక్ రహమతున్నీసా , ఇర్ఫాన్ , జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు షకీల్, యూనస్, అబ్దుల్ నజీర్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం తదితరులు పాల్గొన్నారు