సూపర్ సిక్స్ హామీలు ఎత్తేసే ప్రయత్నాలు చేయొద్దు

సీఎం చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ కీల‌క నేత ముద్ర‌గ‌డ లేఖ‌

కాకినాడ : అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలిచ్చి.. వాటిని ఎత్తేసే ప్రయత్నాలు చేయొద్దని కాపు ఉద్యమ నేత, వైయ‌స్ఆర్‌ సీపీ కీలక నేత ముద్రగడ ప‌ద్మ‌నాభం అన్నారు. ఈ మేర‌కు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయ‌న‌ లేఖ రాశారు. 

‘‘ఇచ్చినా హమీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సినియర్ రాజకీయ నాయకులకు తుగునా?. మీ దొంగ సూపర్ సిక్స్ హమీలను తలచుకుంటే భయం వేస్తొంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే కోట్లాది రూపాయాల నిధులు కావాలని మీకు తెలియదా?.

తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ గుర్తుకు రాకుండా తిరుపతి ప్రసాదం,రెడ్ బుక్ రాజ్యంగం, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య అని ముద్రగడ తీవ్రంగా విమర్శించారు. 

Back to Top