మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా?

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: "మీరు ఓడిపోవడమేంటయ్యా''అని అప్పడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మీ ఇల్లు
వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. నదులు, వాగులను తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాశులు పోగు చేసుకున్నాడో ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలు. ప్రకృతితో పెట్టుకుంటే మటాశే బాబూ'  అని  విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు.

"ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు''అని ఎల్లో మీడియా తీరుపై విమర్శలు గుప్పించారు. కాగా కృష్ణానది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉండటంతో.. ఆయన నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేసిన విషయం తెలిసిందే.

తాజా ఫోటోలు

Back to Top