విశాఖ: టీడీపీ నేత నారా లోకేష్‌పై వైయస్ఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట. ఉద్యమాలు చేసిందట!. టీడీపీ పుట్టింది 1982లో కదా చిట్టీ?’’ అంటూ చురకలు అంటించారు. ‘అవునులే, మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు. నీవు 1978లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు! అంటూ విజయసాయిరెడ్డి చలోక్తులు విసిరారు. చంద్రబాబు భ్రమ రాజకీయాలు.. టీడీపీ ఇంకా బతికే ఉందని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు చేస్తున్నారని మరో ట్విట్‌లో విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. పచ్చ కుల మీడియాలో ఫేక్ న్యూస్ వేయించినంత మాత్రాన పంచాయతీలు గెలిచినట్లా? అని ప్రశ్నించారు. ‘మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడారు. నీ జిల్లా, మీ అత్తగారి జిల్లాలోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనమే బాబూ’’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.