అమిత్ షాను చూసి చంద్రబాబు వణికిపోతున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 

నేతలు పార్టీని వీడుతున్నా కిక్కురమనడం లేదు

అవినీతి కేసులు తిరగదోడుతారని భయం పట్టుకుంది

అమరావతి: బీజేపీ చీఫ్‌ అమిత్‌షాను చూసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వణికిపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి  విమర్శించారు. టీడీపీ నేతలంతా పోలోమని బీజేపీలో చేరుతున్నా కిక్కురుమనలేని పరిస్థితి చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ వదిలివెళుతున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని దుయ్యబట్టారు. అవినీతి కేసులు తిరగదొడుతారన్న భయంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయినట్లు ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

Back to Top