తాడేపల్లి: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో పక్క రాష్ట్రంలో ఒక్క చోట కూడా పోటీ చేయని టీడీపీ పార్టీ హడావుడి చేయడం పట్ల వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించింది. ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరి కాంగ్రెస్, బిజేపీలకు వీళ్ల వల్ల ఒరిగింది ఏమిటి? ఎన్నికలు ఎంతో దూరం లేవు. మీరు పోటీ చేస్తారా? చేయరా? చేస్తే ఏ నియోజకవర్గమో చెప్పగలరా పురంధేశ్వరి గారూ….జవాబు లేదు కదా….టీడీపీతో పొత్తు కుదిరితే మీ బావ గారు విడిచిపెట్టే ఏదో ఒక స్థానంలో మీరు పోటీచేస్తుండొచ్చు..... కానీ .....తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చిన చంద్రబాబు… చంద్రబాబు, పురంధేశ్వరి గార్ల నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను కూడా బీఆర్ఎస్ దక్కించుకుంది. మరి కాంగ్రెస్, బిజేపీలకు వీళ్ల వల్ల ఒరిగింది ఏమిటి? అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తీరు పట్ల సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఆ పోస్టును మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చిత్రం భళారే విచిత్రం ! గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండా ! అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ అసక్తికరంగా మారింది.