నేను ఆయన సేవకుడిని!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. పార్టీ అధ్యక్షుల వారు అప్పగించిన ఏ బాధ్యత అయినా నిర్వర్తించటం మాత్రమే నాకు తెలుసు. మరోసారి నా మీద ఉంచిన నమ్మకానికి... ధన్యవాదాలు. సదా ఆయనకు నేను కృతజ్ఞుడిని, నేను ఆయన సేవకుడిని! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

వైయ‌స్‌ జగన్ గారి స్ఫూర్తితో..
వైయ‌స్ఆర్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ 92% సామర్థ్యంతో ఉత్పాదన సాధించడం గర్వించదగ్గ విషయమ‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. కరెంటు లోటు సమయంలో శ్రమించిన ఇంజనీర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సిఎం వైయ‌స్‌ జగన్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అన్ని కేంద్రాల్లో ఉత్పాదన పెంచాల‌ని విజ‌య‌సాయిరెడ్డి సూచించారు.

Back to Top