హ్యాట్సాఫ్‌ మాలోకం

 వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 
 

 
తాడేపల్లి : కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్‌డౌన్‌ను పాటిస్తుంటే చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి యధేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్‌కు  స్కేట్‌బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్!’ అంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. 

సందు దొరకలేదు కానీ.. 
చంద్రబాబుకు సందు దొరకలేదు కానీ.. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తీసుకొచ్చే ఐడియా తానే ఇచ్చానని డబ్బు వాయించుకునేవాడని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం వరస ట్వీట్లు చేశారు. ‘దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. ‘ఎల్లో వైరస్’ ఇక జాగారం చేయాల్సిందే. దేశంలో జగన్ గారిలా చొరవ చూపిన రాష్ట్రం ఇంకేదైనా ఉంటే ఎల్లో మీడియా చెప్పాలి. సందు దొరకలేదు కాని ఈ ఐడియా ఇచ్చింది నేనే అని డప్పు వాయించుకునేవాడు విజనరీ!’  అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు

తాజా వీడియోలు

Back to Top