తాడేపల్లి: చంద్రబాబు నీచ రాజకీయాలను, రాజధాని విషయంలో చేసే కుట్రలను హిందూ పత్రిక బయటపెట్టిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. బాబు నీచ రాజకీయం గురించి ట్వీట్ చేశారు. `బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డాడు. బీసీజీ వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సీఎం వైయస్ జగన్‌కి 50 శాతం వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయటపెట్టింది. నీ కుట్ర రాజకీయంతో పాతాళానికి జారిపోయావు బాబూ! అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా `దళితులన్నా, బలహీన వర్గాల వారన్నాచంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపే. ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ను దూషించడం చూస్తే అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి పరివర్తన రాలేదని తెలుస్తోంది` అని ట్వీట్ చేశారు.