పవన్ కల్యాణ్ నటనా నైపుణ్యాలను చూసి బాగా ఎంజాయ్ చేశాను

ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో ఆయన నటనా, నైపుణ్యాలను చూసి బాగా ఎంజాయ్‌ చేశానని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.  ఆయనను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పేర్కొంటూ రెమ్యునరేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేశారని ట్విట్టర్‌లో చురకలంటించారు.

'పనవ్ కల్యాణ్ నటనా నైపుణ్యాలను చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. అమరావతి రైతుల ముందు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రదర్శన తీరు చూశాక, టీడీపీ నాయకత్వం నుంచి ఆయన రెమ్యునరేషన్ ను మరింత పెంచుకునేందుకు అర్హుడని నేను భావించాను' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

Back to Top