క్రీడా రంగంలో స్ఫూర్తి నింపిన వీరికి ప్రత్యేక అభినందనలు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: టోక్యో పారాఒలింపిక్స్‌ లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో అవని లేఖారా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అలాగే డిస్కస్ త్రో విభాగంలో యోగేశ్ కథూనియా రజతం సాధించాడు. తమ విజయాలతో భారత క్రీడా రంగంలో స్ఫూర్తి నింపిన వీరికి నా ప్రత్యేక అభినందనలు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

పచ్చ మంద  వీధుల్లోకొచ్చి ఉత్సవాలు..
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నందుకు బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపించాడు చంద్రబాబు. జనరల్ డయ్యర్ వారసుడే ఈ పచ్చాసురుడు.  ఆ ఘటన జరిగి సరిగ్గా 21 ఏళ్లు. అందుకే ఇవాళ పచ్చ మంద  వీధుల్లోకొచ్చి ఉత్సవాలు చేసుకున్నారు. పచ్చనేతల  అధర్మ పోరాటం అప్పటి నుంచి కొనసాగుతునే ఉంది అంటూ అంత‌కు ముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

బాబు అధికారంలో ఉండగా ఏదైనా కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తే...పెట్టుబడుల వరద, బాబు కష్టానికి ఫలితం అంటూ ఎల్లో మీడియా గెంతులేసేది. ఇప్పుడు ఏదైనా సంస్థ మరెవరి వాటాలో కొనుగోలు చేస్తే అదానీప్రదేశ్ గా మారిందని ఏడుపులు. వీళ్ల కడుపు మంటకు మందే లేదు అంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇంకో ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top