ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ నేత విజ‌య సాయిరెడ్డి

న్యూఢిల్లీ:  విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ నేత విజ‌య సాయిరెడ్డి
ట్వీట్ చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా పోలవరం విషయంలో మాట తప్పుతోంది. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ. 55,657 కోట్లు కాగా ఎనిమిదేళ్ల వ్యవధిలో  కేంద్రం ఇచ్చింది రూ.11,182 కోట్లు మాత్రమేన‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద 332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం వైయ‌స్ జగన్ గారు ఆమోద ముద్ర వేశారు. 40 ఎకరాల్లో నిర్మించే ఈ వర్సిటీలో అక్వా రంగానికి సాయపడే పరిశోధనా సంస్థలు వస్తాయి. దీనికి అనుబంధంగా పలాస, కైకలూరుల్లో ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతార‌ని అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ నేత విజ‌య సాయిరెడ్డి
పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top