కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? 

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ సుజనా చౌదరికి అమ్ముడుపోయారా లేదా అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మళ్లీ అడుగుతున్నాను..కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా?  అంటూ నిలదీశారు. టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తానని ట్వీట్‌ చేశారు.

శవ రాజకీయాలు చేయొచ్చని ఆరాటం...
నిన్నటి వరకు టెస్టులు చేయడం లేదు. కోవిడ్ ను దాచిపెడుతున్నారని ఏడ్చిన వ్యక్తి, ఇప్పుడు ఎవరినడిగి దక్షిణ కొరియా నుంచి టెస్ట్ కిట్లు కొన్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వం ఏ పని చేయకూడదు. మరణాలు పెరిగితే శవ రాజకీయాలు చేయొచ్చని టీడీపీ నేతల ఆరాటమని మరో ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top