భారతరత్న ఇస్తామంటే ఎందుకు అడ్డుకున్నావ్ బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ 
 

న్యూఢిల్లీ:  జయంతికి, వర్ధంతికి మైకుల  ముందుకొచ్చి ఎన్టీఆర్ కు  భారతరత్న ఇవ్వాలంటావు. కేంద్రంలో చక్రాలు తిప్పానని చెప్పుకునే రోజుల్లో ఏం చేశావ్ నాయుడు బాబు? చాలామందిని  రాష్ట్రపతుల్ని చేశా, ప్రధానుల్ని చేశానంటావె ..మరి వాజ్ పేయి టైంలో భారతరత్న ఇస్తామంటే ఎందుకు అడ్డుకున్నావ్? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.

డ్రామాలు మొద‌లు పెట్టారు..
బాబు, ఉమల అవినీతిపై చర్చ పెడితే ఐదేళ్లయినా పూర్తి కాదు. ఇసుక మాఫియా నడిచింది నీ కనుసన్నల్లోనే కదా ఉమా? ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను 100 శాతానికి పైగా పెంచి ప్రజాధనాన్ని దోచుకున్నదెవరు? దర్యాప్తు మొదలవుతుందనే వణుకుతోనే డ్రామాలు మొదలు పెట్టావు అంటూ  అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top