జిమ్మిక్కుల మీద ఇంకా ఎన్నాళ్లు బతకుతావు లోకేశం? 

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  టీడీపీ నేత నారా లోకేష్ తీరును వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. పబ్లిసిటీ జిమ్మిక్కుల మీద ఇంకా ఎన్నాళ్లు బతకుతావు లోకేశం? ఇంట్లో చేతులు నలుపుకుంటూ కూర్చున్నా రోజంతా మీ ఎల్లో టీవీలు లైవ్ పెట్టి చూపిస్తాయి. ఇంత దూరం వచ్చి ఏం సాధించినట్టు. ప్రజలను గుండెళ్లో పెట్టుకుని చూసేవాళ్లకే ఆదరణ ఉంటుంది. నువ్వో వెలిసిపోయిన జెండావి. సంస్కార హీనుడివి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌కు రూ.300 కోట్లు ఖ‌ర్చు
రాష్ట్రంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జగన్ గారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. సెప్టెంబర్‌ 15 నాటికి రాష్ట్రంలో ఆస్పత్రుల్లో 6 వేల బెడ్లు, 140 ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్‌ ప్లాంట్ల కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు పెడుతోందని అంత‌కు ముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top