బాబు క్రియేషనే భ్రమరావతి

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన రోడ్డుపై ట్యాంకర్లతో పసుపు నీళ్లు కుమ్మరించిన ఉన్మాదులున్న భ్రమరావతిలో నివసిస్తే ఆయుష్షు పెరుగుతుందట. ఆరోజుల్లో ‘పిట్టలదొర’ మాటలు అలా ఉండేవి. ఆసియాలోని అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో టోక్యో, సింగపూర్ తప్ప ఎవరికీ చోటు దక్కలేదు. బాబు క్రియేషనే భ్రమరావతి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

 విమానయాన మంత్రిగా ఉన్నా పూసపాటి అశోక్‌కి ఆ పదవి అలంకార ప్రాయమే. ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ కాంట్రాక్టుల నుంచి, గ్రీన్‌ఫీల్డ్ (ప్రైవేటు) ఎయిర్‌పోర్టుల అనుమతులు, ఉన్నతాధికారుల నియామకాలు, బదిలీలు మాత్రం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగేవి. అశోక్‌ది పదవీ వ్యామోహం. బాబుది పైరవీల ఆరాటం అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top