న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. చంద్రన్నా...బతికి ఉండగా నీ తలిదండ్రులను పట్టించుకోలేదు. చనిపోయిన తర్వాత వారికి తలకొరివి కూడా పెట్టలేదు. సొంత తమ్ముడిని పిచ్చోడి ముద్ర వేసి గొలుసులతో కట్టేయించావు. వరసకు తమ్ముడినైన నన్ను కూడా జైలుకు పంపించావు. అసలు నువ్వు మనిషివేనా....మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడపతొక్కనని మంగమ్మ శపథం చేశాడు...ఆ ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓట్ వేశాడు బాబు. ఇక సీఎం కాలేనన్న క్లారిటీ ఆయనకుంది. పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోంది. అంటూ మరో ట్వీట్ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఈరోజు జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఓటు వేయడం జరిగింది. ఈ ఎన్నిక ద్వారా తొలిసారిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కాబోతున్నారంటూ విజయసాయిరెడ్డి ఉదయం మరో ట్వీట్ చేశారు.