రెచ్చ‌గొడితే ఏడేళ్లు జైలు శిక్ష త‌ప్ప‌దు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

 తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌పై గెరిల్లా యుద్ధం చేయాలంటూ రెచ్చ‌గొడితే ఏడేళ్లు జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌కు చుర‌క‌లంటించారు. పచ్చ బాస్ అధికారంలో ఉన్నప్పుడు భూములు, సంపద దోచుకున్న కుల మీడియాకు  ఇప్పుడు 'రూల్ ఆఫ్ లా' చూసి భయం పట్టుకుంది. పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి తప్ప 
విగ్రహాలు ధ్వంసం చేసినట్లుగా ముఖ్యమంత్రిగారిపై గెరిల్లాయుద్ధం చేయాలంటూ రెచ్చగొడితే IPC124 కింద  7 ఏళ్లు జైలుశిక్ష తప్పదని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top