దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్‌ అన్నట్లుంది వీళ్ల వ్యవహారం

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్‌

తాడేపల్లి: కరోనా బూచిని చూపి ఎన్నికలు వాయిదా వేయడం మంచి నిర్ణయం కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వాయిదాపై ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.  పచ్చపార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎన్నికలు వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్‌ అన్నట్లుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top