గోరింటాకు పెట్టించుకుని ఫాం హౌజ్‌లో పడుకుంటే ఎలా చిట్టీ?

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  టీడీపీ నేత నారా లోకేష్ హైద‌రాబాద్‌కు ప‌రిమితం కావ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆషాడంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతుంటాయి. రాష్ట్రంలో తిరగడానికి నీకు మాత్రం ఆంక్షలేమీ లేవు లోకేశా. మీ కుటుంబ సేవకులంతా నిన్ను బాగా తిప్పాలని బాబుకు సలహాలిస్తుంటే ఆషాఢం అంటూ  చేతులకు గోరింటాకు పెట్టించుకుని ఫాం హౌజ్‌లో పడుకుంటే ఎలా చిట్టీ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

 పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌స్తావిస్తాం..
కేంద్ర ఆహార భద్రతా చట్టంలోని అసమానతల వల్ల ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామ‌ని విజ‌య‌సాయిరెడ్డి  మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top