అభివృద్ధి వికేంద్రీకరణే పోట్టి శ్రీ‌రాములుకు అసలు సిసలైన నివాళి

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌రాష్ట్ర సాధ‌న‌కు అమ‌రులైన పొట్టి శ్రీ‌రాములుకు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణే మ‌నం ఇచ్చే అస‌లు సిస‌లైన నివాళి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  ఆంధ్ర రాష్ట్రం అమరుడయ్యారు పొట్టి శ్రీరాములు. వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుణ్ణి స్మరించుకుంటూ... ఆంధ్రులంతా ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుందాం. అభివృద్ధి వికేంద్రీకరణే ఆయనకు మనం ఇచ్చే అసలు సిసలైన నివాళి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 ఈ మహాయజ్ఞాన్ని దేశం మొత్తం అనుసరిస్తుంది..
భూముల రీ సర్వేతో వివాదాలు, హద్దు తగాదాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడుతుంది. కచ్చితమైన వివరాలతో రికార్డులు తయారవుతాయి. ఈ మహాయజ్ఞాన్ని దేశం మొత్తం అనుసరిస్తుంది. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం వల్ల భూ యజమానులకు శాశ్వత హక్కు, చట్టపరమైన భద్రత సమకూరుతుందంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top