బాబు అను-కుల మీడియా కింద మీదా పడుతోంది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

తాడేపల్లి:  పోతిరెడ్డిపాడు జిఓపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి బాబు అను-కుల మీడియా కింద మీదా పడుతోందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు.  బాబు సిఎంగా లేని రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దని కుతంత్రాలు పన్నుతోంది. రాజకీయ పార్టీల కంటే ఎల్లో మీడియా ఎజెండానే అత్యంత క్రూరంగా, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవాలన్నట్టుగా ఉంది.  

100 కోట్ల పెనాల్టీ విధించింది నీ హయాంలోనే కదా? 
ఇసుక మాఫియాను సృష్టించి నదులను అడుగంటా ఊడ్చినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ విధించింది నీ హయాంలోనే కదా? అంటూ మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజిలో 15 ఎకరాల కృత్రిమ ద్వీపం ఏర్పాటుకు డ్రెడ్జింగుకు అనుమతిందీ నువ్వే. ఇప్పుడు మడ అడవుల పేరుతో పర్యావరణం ఖూనీ అని దొంగ ఏడుపులేడుస్తున్నావంటూ ట్వీట్‌ చేశారు.

Back to Top