తాడేపల్లి: అలుపు లేకుండా అబద్ధాలు గుప్పించడానికి సిగ్గనిపించదా అల్జీమైర్స్ బాబూ? అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎవరు బిజినెస్ చేసుకున్నా వేరే ఎవరికో అంటగట్టడం. నీ హెరిటేజ్ ఫ్రెష్ ను కొన్న కంపెనీ ఎందుకు మటాష్ అయిందో చెప్పు? అమరావతి భూదందాలో లక్ష కోట్లు దోచుకున్నోడివి. అందరూ నీలాగే ఉంటారనుకుంటే ఎలా? అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో ప్రశ్నించారు. హాస్యనటులతో షోలు 'బ్లాక్ డాగ్’ బ్రాండును కొత్తగా తెచ్చాడు గుంట నక్క. రేయింబవళ్ళు తాగి, తూలే వీడు...మధ్యలో స్క్రిప్ట్ చదివి, కామెడీ స్కిట్లు చేసి పడుకుంటాడు. ఎల్లో మీడియాను ఎవరూ చూడటం లేదని హాస్యనటులతో షోలు పెట్టి రేటింగులు పెంచాలనుకుంటున్నావా కుట్రల బాబూ? అంటూ మరో ట్వీట్ చేశారు. ప్రజలే తరిమికొడతారు ఈ కుక్కల్ని ప్లీనరీ ఘనవిజయంతో ఫ్యూజులు ఎగిరిన చవట బాబుకు ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. కుక్కలన్నిటినీ గొలుసులు విప్పి వదిలాడు. అవి పోటీ పడి మొరుగుతున్నాయి. వానా కాలం కదా. శునకాలకు పిచ్చి ఎక్కే సీజన్ ఇది. ప్రజలే తరిమికొడతారు ఈ కుక్కల్ని అంటూ విజయసాయిరెడ్డి తాజాగా మరో ట్వీట్ చేశారు.