తాడేపల్లి: చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ ఖాతాలో విజయసాయిరెడ్డి పోస్టు చేశారు. చంద్రబాబుకు వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు' అంటూ ఎద్దేవా చేశారు. లేని నగరాన్నే గ్రాఫిక్స్‌లో సృష్టించి వాటాలు 'లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం - పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు చంద్రబాబు. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ? లేని నగరాన్నే గ్రాఫిక్స్‌లో సృష్టించి వాటాలు పంచినోడివి. బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.