చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మొదలైంది!

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ:  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క్రియ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే మొద‌లైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ట్వీట్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మొదలైంది. పోస్కో కంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించినట్టు స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటులో తెలిపారు. అయినా బాబు రంకెలు వేస్తూ రెండు కళ్ల సిద్ధాంతం జపిస్తున్నాడు అంటూ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top