చంద్రబాబు ఇప్పుడు నోరు విప్పడానికి సిగ్గుపడుతున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి
 

           
 తాడేప‌ల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో టీడీపీ ఓడితే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావని ప్రచారం చేసిన ఆయన బృందం ఇప్పుడు పెట్టుబడులు వస్తుండడంతో సిగ్గుతో తలదించుకోవాలని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘మేం ఓడితే పెట్టుబడులు రావు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతాయని శాపనార్థాలు పెట్టిన చంద్రబాబు, ఆయన భజన బృందం నోరు విప్పడానికి సిగ్గుపడుతున్నారు. సీఎం జగన్ గారి చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. గతంలోలాగా ఎవరికీ కమీషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top