ఆ గట్టునుంటావా ’నారన్న’...

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

న్యూఢిల్లీ:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఆ గట్టునుంటావా ’నారన్న’ ఈ గట్టునుంటావా? ఎవరెన్ని రకాలుగా పాడుకున్నా చంద్రబాబు నామోషీ పడరు. అవసరమైతే మళ్ళీ బీజేపీకి మోకరిల్లుతారు. వాళ్లు నో అంటే కాంగ్రెస్ ఉండనే ఉంది. కొడవలి పార్టీ వాళ్లు చుట్టాలే. రాజనీతిపై నమ్మకం లేదు. ప్రతీది బిజినెస్ అంటాడు. ఎన్నికోట్లయినా ఫండింగు చేస్తారంటూ ట్వీట్ చేశారు. 

ఈ శిఖండి ప్రకటనలేంటి బాబులూ?
2014లో మోదీని పీఎం కానివ్వనంటూ ముంబైలో సోనియా శపథం. మోదీ టీ అమ్ముకో అంటూ మరొకరు ఎగతాళి. 2024లో జగన్ గారిని సీఎం కానివ్వబోమంటూ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఇలాంటి సవాళ్ళే చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేంది ప్రజలే. మధ్యలో ఈ శిఖండి ప్రకటనలేంటి బాబులూ? అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top