అయ్యప్ప నాయుడు అందరికీ ఆదర్శం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  తాను మరణిస్తూ ఏడుగురికి ప్రాణదానం చేసిన తాడేపల్లికి చెందిన వైద్య విద్యార్థి అయ్యప్ప నాయుడు అందరికీ ఆదర్శప్రాయమ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నాయుడి  అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సకాలంలో అవయవాలను తరలించిన పోలీసులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top