‘అదిరిందయ్యా చంద్రం’ 

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: ప్రధానికి లేఖ రాస్తే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ జవాబిచ్చారు. ‘అదిరిందయ్యా చంద్రం’ అన్నారని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నాడని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఎద్దేవా చేశారు.  ఈయనిచ్చిన సలహా ఏమిటంటే కరోనా లెక్కలపై డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలట. తన కొంప ముంచిన బోర్డును కేంద్రంలో కూడా అమలు చేయాలని చెప్పాడు. వాళ్లూ మునగాలని కోరుకుంటున్నాడంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

 కార్పోరేట్‌ స్కూళ్ల కోసమే బాబు ఏడుపు
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని సిఎం జగన్ గారు ప్రకటించినప్పటి నుంచి పేదలను అవహేళన చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇంగ్లిష్ రాదు కాబట్టి పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోలేరట. తెలుగును కాపాడాల్సిన బాధ్యత పేదలదేనట. కార్పోరేట్ స్కూళ్ల ప్రయోజనాల కోసమే ఈ ఏడుపంతా అంటూ మరో ట్వీట్‌ చేశారు.

Back to Top