కేంద్ర బడ్జెట్‌ నిరుత్సాహపరిచింది

వివక్షతతో చూడడం మంచిది కాదు

వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవు

రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టు ఒక్కటీ ప్రకటించలేదు

వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలి

రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పార్లమెంట్‌లో పోరాడుతాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి

ఢిల్లీ: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి మొండి చెయ్యి చూపించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి అన్నారు.  వ్యవసాయాధారిత ఆంధ్రరాష్ట్రాన్ని వివక్షతతో చూడడం మంచిది కాదని, బడ్జెట్‌ నిరుత్సాహ పరిచిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురుచూశామని, హోదాపై ప్రస్తావన లేకపోవడం, వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్ల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రరాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి హక్కులు సాధించుకుంటామని విజయసాయిరెడ్డి అన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని, బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయన్నారు.  

బడ్జెట్‌ ప్రసంగం అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల బృందంతో కలిసి విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘2020 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు నిరాశ కలిగించింది. బడ్జెట్‌లో ప్రధానంగా మూడు అంశాలు కవర్‌ చేయాలనుకున్నాం.. ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌కు సంబంధించి, ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం జరిగిందని ప్రస్తావించాలనుకున్నాం. ఎకనమిక్‌ సర్వేకు సంబంధించి ఇన్‌ఫ్లేషన్‌ రేట్‌ అనేది మొదటి త్రైమాసికలో 3.3 శాతం నుంచి 7.35 శాతంగా పెరగడం ఒక రకంగా మంచిది కాదు. అగ్రికల్చరల్‌ అండ్‌ అలైడ్‌ సెక్టార్స్‌ ఇన్‌ జీవీఏలో వరుసగా పడిపోతూ వస్తుంది. 70 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని మర్చిపోవద్దు. వీటిని ఎకనామిక్‌ సర్వేలోనే డౌన్‌వర్డ్‌ రివిషన్‌ ఆఫ్‌ ఇండియా జీడీపీ గ్రోత్‌ లెక్కల ప్రకారం 2020–2021లో 6 నుంచి 6.5 శాతంగా అంచనా వేస్తున్నారు. ఫిజికల్‌ డెఫిసిట్‌ను ఎకనామిక్‌ సర్వేలో ప్రస్తావించడం జరిగింది. ఫిజికల్‌ డెఫిసిట్‌ను కంట్రోల్‌ చేసేందుకు ఫుడ్‌ సబ్సిడీ, ఫామ్‌ లోన్‌ వేయివర్స్‌ను వీలైనంత వరకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రరాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి పూర్తిగా పరిశీలించాలి.

ఎగుమతులను బూస్టప్‌ చేసేందుకు ఎకనామిక్‌ సర్వే రిపోర్టులో నెట్‌వర్క్‌ ప్రొడక్ట్‌ మీద మాత్రమే ఫోకస్‌ పెట్టారు. నెట్‌వర్క్‌ ప్రొడక్ట్‌ మాత్రమే కాకుండా మిగతా ఎక్స్‌పోర్ట్స్‌ కాఫీ, టీ, స్పెయిసెస్‌ మిగతా వాటిపై కూడా ఎక్స్‌పోర్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం గుర్తించాలి. ఎకనామిక్‌ సర్వే రిపోర్టులో ఫోకస్‌ అంతా క్రియేషన్‌ ఆఫ్‌ వెల్త్‌ ఎట్‌ ద గ్రాస్‌ రూట్‌ లెవల్‌ అనే దాన్ని ప్రస్తావించారు. ఇది చేయాల్సిన అంశమే..

బడ్జెట్‌లో కొన్ని పాజిటీవ్‌.. కొన్ని నెగిటీవ్‌ అంశాలు ఉన్నాయి. బడ్జెట్‌లో డిపాజిటర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ అనేది ఎవరైనా ఒక డిపాజిటర్‌ బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేస్తే గతంలో రూ. లక్ష వరకు మాత్రమే ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచడం అభినందించాల్సిన విషయం. స్మాల్‌ డిపాజిటర్స్‌కు తప్పకుండా న్యాయం చేకూర్చుతుంది. ఫిజికల్‌ డెఫిసిట్‌ ఎస్టిమేట్‌ అనేది 3.8 శాతంగా బడ్జెట్‌లో ఎస్టిమేట్‌ చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం యాక్టు ప్రకారం 3 శాతంకు రెస్ట్రిక్ట్‌ కావాలి.. అయినప్పటికీ 3.8 శాతం అంటే ఒకరకంగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎకనామిక్‌ డౌన్‌ స్లైడ్‌ను ఓవర్‌కం కావాలంటే 3 శాతం లిమిట్‌ అయినా కూడా 3.8 శాతానికి పోవడం ఏమాత్రం వెనకాడకూడదనేది మా ఉద్దేశం.

రైతుల విషయానికి వస్తే బడ్జెట్‌లో 15 లక్షల కోట్ల రూపాయల అగ్రికల్చరల్‌ క్రెడిట్‌ అనౌన్స్‌ చేశారు. ఆంధ్రరాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి 15 లక్షల కోట్ల రూపాయాల్లో రాష్ట్రానికి చెందాల్సిన వాటా ఎలాంటి వివక్షత లేకుండా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల ఆదాయం 2022 నాటికి రెండింతలు చేస్తామని ప్రధానిగా మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ఫైనాన్స్‌ మినిస్టర్‌ అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. మనం 2020లో ఉన్నాం.. ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. ఎలా రైతుల ఆదాయం రెండింతలు చేస్తారో స్పష్టత లేదు.

ఫర్టిలైజర్స్‌ విషయానికి వస్తే.. నాన్‌ కెమికల్‌ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్‌ ఫర్టిలైజర్స్‌ వాటిని ప్రోత్సహించాలి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి ఎక్స్‌పోర్టును ఇంక్రీజ్‌ చేయాలనుకోవడం మంచి ఉద్దేశం. అగ్రికల్చరల్‌ ఇరిగేషన్‌కు సంబంధించి 2.83 లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ రూ.3.6 లక్షల కోట్లు కేటాయించడం మంచి విషయం. దాంట్లో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి ఫైనాన్స్‌ ఇప్పిస్తున్నప్పటికీ ప్రాజెక్టు మరిచిపోకుండా పోలవరం పేమెంట్స్‌ త్వరితగతిన రిలీజ్‌ చేయాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వంద వాటర్‌ స్ట్రెస్సుడ్‌ డిస్ట్రిట్స్‌ దేశంలో ఉన్నాయో. వాటికి కాంప్రహెన్సివ్‌ వాటర్‌ సప్లయ్‌ స్కీమ్‌ సపోర్టు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. దాంట్లో ఆంధ్రరాష్ట్రానికి న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుచేస్తుంటుంది.

ఇప్పటి వరకు ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా ఆంధ్రరాష్ట్రానికి ఇవ్వలేదు. వంద ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేస్తామన్నారు.. ఆంధ్రరాష్ట్రానికి చెందాల్సిన వాటా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళా సంక్షేమం, షెడ్యుల్‌ ట్రైబ్స్‌కు సంబంధించి పథకాలకు రూ.28,600 కోట్లు కేటాయించడం అభినందించాల్సిన విషయం. రాష్ట్రానికి ఎంతో సహాయం వస్తుంది ఎదురుచూశాం. ఆంధ్రరాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని స్పష్టంగా తెలుస్తుంది. కేంద్రం పక్షపాత ధోరణి చూపించకుండా.. మొత్తం దేశాన్నే హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ది కంట్రీ అనే కాన్సెప్టును దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు సమానంగా చేయాలని కానీ, రాష్ట్రాన్ని వివక్షతతో చూడడం మంచిది కాదు. అదే విధంగా ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశాం. వైయస్‌ఆర్‌ సీపీ మొదటి నుంచి హోదా కోసం పోరాడుతుంది. వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్ల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం. ఆంధ్రరాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం.. కేంద్రం దృష్టికి తీసుకువస్తాం. రావాల్సిన హక్కులు, వాటాలను సాధించుకుంటాం’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top