వైయ‌స్ఆర్‌సీపీకి రైతులే వెన్నెముక‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి:  యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ (వైయ‌స్ఆర్ కాంగ్రెస్) పార్టీకి రైతులే వెన్నెముక అని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ రైతు విభాగం స‌మావేశం నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి , ఇతర రైతు నాయకులతో  విజ‌య‌సాయిరెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతు ప‌క్ష‌పాతి అని, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని విజ‌య‌సాయిరెడ్డి రైతు విభాగం నాయ‌కుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top