కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి

 అఖిలపక్ష సమావేశం అనంతరం  ఎంపీ వి. విజయసాయిరెడ్డి  

  రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మరో 24 పంటలకు కూడా కేంద్రం ఎంఎస్పీ ప్రకటించాలి 

 దిశ బిల్లును ఆమోదించాలి 

 విభజన హామీలన్నీ నెరవేర్చాలని పార్లమెంటులో పోరాడతాం 

 బాబు ఏడుపు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

న్యూఢిల్లీ:  పార్ల‌మెంట్ స‌మావేశాల్లో క‌నీస‌మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి డిమాండు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం  వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోడాన్ని స్వాగతిస్తున్నాం. గంతంలో పార్లమెంటులో కూడా మేం వ్యవసాయ చట్టాలకు సంబంధించి పలు అభ్యంతరాలను తెలియజేశాం. ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) విషయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. ఎంఎస్పీ లో ఎవరైతే స్టేక్‌ హోల్డర్స్‌ ఉన్నారో, వారితో చర్చించి వాటిని పునఃపరిశీలించాలని చెప్పడం జరిగింది. రైతులు, రైతు సంఘాలు, స్టేక్ హౌల్డర్స్ అభిమతాన్ని తెలుసుకునే విధంగా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి,  కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరాం. 

 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 23 వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే మద్దతు ధర ఇచ్చింది. వీటికి మాత్రమే కాకుండా అదనంగా మరో 24 కమొడిటీస్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు రాష్ట్రంలో ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) కల్పిస్తున్నారు. వీటి మొత్తానికి ఎంఎస్పీ కల్పిస్తూ, చట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది. ఇవే కాకుండా అగ్రికల్చరల్‌ ప్రొడక్ట్స్‌ మాత్రమే కాకుండా మెరైన్‌ ప్రొడక్ట్స్‌కు, పౌల్ట్రీ ప్రోడక్ట్స్‌కు కూడా కనీస మద్దతు ధర కల్పించాలని వైయస్సార్‌ సీపీ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేసింది. రేపు ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా ప్రస్తావిస్తాం.

 ఇవే కాకుండా నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. 2.65 కోట్లు మంది మాత్రమే ఇందులో కవర్‌ అవుతున్నారు. 2021లో జరగాల్సిన జనాభా గణన కూడా ఆగిపోయినందున రివైజ్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌కు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

 మా అధినేత వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ఆదేశాల మేరకు అఖిల పక్ష సమావేశంలో సోషియో ఎకానమిక్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ జరపాలని చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేదానికి,  బీసీల అభ్యున్నతికి సోషియో ఎకానమిక్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ (ఎస్‌ఈసీసీ) అనేది చాలా ముఖ్యం. గత 70ఏళ్లగా ప్రభుత్వాలు ఈ అంశాన్ని విస్మరించడం వల్ల ఓబీసీల్లో కూడా కేవలం అప్లియేటెడ్‌ పీపుల్‌ మాత్రమే ఈ ప్రయోజనాలును పొందుతున్నారు. కాబట్టి నిజంగా బీసీల్లో అణగారిన వర్గాలను గుర్తించి, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఎస్‌ఈసీసీ చాలా అవసరం. వారిని, మిగతా అన్నివర్గాలకు సమాంతరంగా తీసుకువచ్చేందుకు ఇది దోహదపడుతుందని చెప్పడం జరిగింది. బీసీ జనగణనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలుసు. జన గణన అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయదు కదా? సాధారణ జనాభా లెక్కలతో పాటు సోషియో ఎకానమిక్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ వివరాలు కూడా తీసుకోవాలని మేము కోరుతున్నాం.

 మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్లు అన్ని కార్పొరేషన్‌లలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోంది. ఇది 33శాతం కాకుండా, 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేము ప్రైవేట్‌ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. అది చర్చకు వచ్చినప్పుడు దానిపై చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆవిధంగా చట్టం చేయాలి. 2010లో రాజ్యసభలో బిల్లు పాస్‌ అయినప్పటికీ కూడా 2021 వరకూ కూడా ఏ ప్రభుత్వం కూడా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్‌ చేయలేదని ఆల్‌ పార్టీ మీటింగ్‌లో చెప్పడం జరిగింది.

  దిశ బిల్లు కూడా త్వరితగతిన ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ అవసరం అయిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం మేరకు ఆ రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా చేయడం జరిగింది. దానికి సంబంధించి రూ.6,112 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ బకాయిలు విషయంలో ఆల్‌ పార్టీ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకువచ్చాం. ఒకవేళ తెలంగాణ సర్కార్‌ ఇవ్వలేనట్లయితే కేంద్రమే ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అలానే విభజన హామీలకు సంబంధించి ఇప్పటివరకు పరిష్కారం కాని అంశాలపై కూడా పార్లమెంటులో పోరాడతాం. 

 శాసనసభలో జరిగినటువంటి చర్చలో ఎవరు ఏమన్నారనేది రికార్డుల్లో ఉంటుంది. అసెంబ్లీ రికార్డుల్లో అఫీషియల్‌ ఆడియో, వీడియోలు ఉన్నాయి. మీడియా కూడా ఆ రికార్డులను పరిశీలించండి. నిజంగా ఆ వీడియోలో చంద్రబాబును కానీ, ఆయన కుటుంబసభ్యులను కానీ ఏదైనా అన్నారా అన్నది మీరూ చూడండి. ఎవరూ ఏమీ అనకుండానే, ఆయనకు ఆయనే ఏదో ఊహించుకుని కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. బయటకు వచ్చి ఏడుపు డ్రామా ఆడారు. సాధారణంగా మగవాళ్లు కంటతడి పెట్టుకోరు. కానీ చంద్రబాబు నాయుడు ఆ పని చేశారు. ఏడుపు డ్రామ వేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారు. ఇది తగదు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు ఏడుపు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైనా యాక్షన్‌కు ఒక రియాక్షన్‌ ఉంటుంద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
 

తాజా వీడియోలు

Back to Top