తాడేపల్లి: కరోనా నియంత్రణలో సీఎం వైయస్ జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని, అంతా యువ సీఎం వైపు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. అత్యధిక టెస్టులు చేయడంలోనే కాదు. వెంటిలేటర్లు,ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు, ICUబెడ్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పిన రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుంది. అత్యవసర వైద్య బృందాలను ఎక్కడికైనా పంపించే సామర్థ్యం సాధించి రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపినందుకు అంతా యువ సిఎం వైపు చూస్తారు. టెలి మెడిసిన్‌ను పల్లెబాట పట్టించారు.. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇంకా తప్పటడుగుల దశలో ఉన్న టెలిమెడిసిన్ ను పల్లెబాట పట్టించారు జగన్ గారు. డా.వైఎస్సార్ టెలిమెడిసిన్ పేరుతో మార్చిలో మొదలైన కార్యక్రమం సూపర్ హిట్ అయింది. దేశంలో కొన్ని వైద్య సంస్థలకే పరిమితమైన ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో విస్తరించింది ఏపీనే అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.