రూ.2 వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం 

 వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)  తీసుకున్న నిర్ణ‌యాన్ని వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి స్వాగ‌తించారు.  క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు.. రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్‌లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది.  తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని విజ‌య‌సాయిరెడ్డి  ట్వీట్ చేశారు. నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను రద్దు చేయాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

Back to Top