టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ కారణం పప్పు నాయుడూ

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు . పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావు. చదువు’కొన్న’వాడివి. నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి? అంటూ ట్వీట్‌లోనిల‌దీశారు.

కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలైతే చర్యలు తీసుకుంటామని బెదిరించిందెవరు? కిందిస్థాయి నుంచి పైవరకు పాస్ పర్సెంటేజిని పెంచడానికి ఏం చేశారో తెలియదా. మీ అండదండలున్న కార్పోరేట్ సంస్థల్లో చదివే పిల్లలు ఆలిండియా ర్యాంకర్లాయె. ఇప్పుడా ర్యాంకులు తగ్గాయని ఏడుపా బాబూ? అంటూ మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top