ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

ఢిల్లీ: నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు తప్పు చేశామని ఎక్కడా పశ్చాతాపం పడకుండా పారిపోయేందుకు యత్నించి పోలీసులపై రాళ్లు రువ్వారంటే వారిలో పూర్తిగా మానవత్వం చచ్చిపోయినట్లుందన్నారు. బాధిత తల్లిదండ్రులకు దిశను ఇవ్వలేకపోయినా ఎన్‌కౌంటర్‌తో ఆ తల్లిదండ్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నిందితులకు ఇలాంటి శాస్తి జరగాలని ప్రజలంతా కోరుకున్నారన్నారు. మరో మారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను పెంచిపోషించే విధంగా కాకుండా కఠిన శిక్షలు తీసుకోగలిగితె కచ్చితంగా రానున్న రోజుల్లో మహిళలకు భద్రత కలుగుతుందన్నారు. 
 

Read Also: దిశకు న్యాయం జరిగింది

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top