రక్తదానం.. ప్రాణదానం

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా మెగా ర‌క్త‌దాన శిబిరం
 

విశాఖ‌: అన్ని దానాలలో కంటే రక్తదానమే మహాదానమని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ   అన్నారు. వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత  వి. విజయ సాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కెకె రాజు  అధ్వర్యంలో విశాఖలో గురువారం మెగా  రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడారు.  వైయ‌స్ఆర్, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభిమానులు విరివిగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలో రక్తనిల్వలు సరిపడనంతగా లేవని అందువలన ఆపదలో ఉన్న వారికి రక్తం అందించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.  అనంత‌రం ర‌క్త‌దానం చేసిన వారికి స‌ర్టిఫికేట్లు అంద‌జేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top