అనంతపురం: ఆ వీడియోపై నేను ప్రమాణం చేస్తా.. ఓటుకు కోట్లు కేసులో కాణిపాకంలో ప్రమాణం చేస్తావా చంద్రబాబూ..? అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తాను లేనని బాబు ప్రమాణం చేస్తే.. ఎంపీ పదవికి అక్కడే రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్ ఏమన్నారంటే... *ఫేక్ వీడియోలు, సర్టిఫికేట్ తో అడ్డంగా దొరికారు* మార్ఫింగ్ చేసిన ఒక అశ్లీల ఫేక్ వీడియోను సోషల్ మీడియా-మీడియాలో ట్రోల్ చేసి టీడీపీ నేతలు నాపై బురదచల్లాలని చూస్తే.. పోలీసులు ప్రాథమిక విచారణలో అది ఫేక్ వీడియో అని తేలింది. అది రుచించని చంద్రబాబు అండ్ కో.. అమెరికాలోని ఎక్లిప్స్ అనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్ళి, ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చి ప్రజలను నమ్మించాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టి, టీడీపీ దొంగలు అడ్డంగా దొరికిపోయారు. సీఐడీ చీఫ్ ఎక్లిప్స్ సంస్థ అధినేతకు ఈ మెయిల్ రాస్తే.. ఇది మేము ఇచ్చిన రిపోర్టు కాదని, ఏదైతే టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారో అది ఒరిజనల్ రిపోర్టు కాదని టీడీపీ కుట్రలకు చెక్ పెడుతూ, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సమాధానం చెప్పారు. ఇది చూసిన టీడీపీ నేతలు కాలుగాలిన పిల్లుల్లా.. ఏం చేయాలో అర్థం కాక, వీడియోలో ఉన్న వ్యక్తులు ఒరిజినలా.. కాదా.. అంటూ ఇంకా ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియోనే ఫేక్ అయినప్పుడు, టీడీపీ వాళ్ళు తెచ్చిన సర్టిఫికేటే ఫేక్ అయినప్పుడు.. వీళ్ళు ఫేక్ మనుషులని అర్థం కాలేదా..? *టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆలోచించండి* ఈ అశ్లీలమైన, దొంగ వీడియోకు సంబంధించి మాట్లాడటానికి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు ఎవరూ ముందుకు రాకపోతే... ఆ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులనే ఉపయోగించి మాట్లాడించారు. వారందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. నా మీద బురదజల్లారు, నాకు అభ్యంతరం లేదు కానీ, టీడీపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబును, వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఏబీఎన్ లో గానీ, టీవీ 5 లో గానీ, ఈటీవీలోగానీ.. ఏనాడైనా చర్చకు పెట్టారా.. ? అని చంద్రబాబును, ఆ ఎల్లో మీడియాను బీసీ సోదరులు ప్రశ్నించాలి. - ఓటుకు కోట్ల కేసులో.. ఏసీబీకి చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే.. ఆంధ్రప్రదేశ్ పరువును, ప్రతిష్టను తాకట్టు పెట్టి, పదేళ్ళు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నగరాన్ని వదులుకొని, తేలు కుట్టిన దొంగలా నాడు పరారై వచ్చాడు. ఓటుకు కోట్లు వ్యవహారంలో.. చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన మాటలు, ఆయన పంపిన రూ. 50 లక్షల డబ్బులతో సహా ఆడియోల్లో, వీడియోల్లో దొరికాయి.. దానిమీద ఏబీఎన్ గానీ, టీవీ 5 గానీ, ఈటీవీ గానీ.. ఒక్క నిమిషం అయినా ఎందుకు చర్చ పెట్టలేదు. ఇప్పుడు అయినా, ఆ అంశంపై చర్చ పెట్టమని నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు నిలదీయండి. *బాలకృష్ణ, లోకేష్ లకు వర్తించదా..?* అలానే టీడీపీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు బాలకృష్ణ ఒక బహిరంగ సమావేశంలో ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడాడు. "అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. లేకుంటే కడుపు అయినా చెయ్యాలి.." అని పబ్లిక్ గా బాలకృష్ణ మాట్లాడాడు. ఆ వీడియోలు ఇప్పటికీ యూ-ట్యూబ్ లో సజీవంగానే ఉన్నాయి. ఇప్పటివరకు బాలకృష్ణ ఎక్కడా ఖండన కూడా ఇవ్వలేదు. ఈ వ్యాఖ్యలపై ఏనాడైనా ఏబీఎన్ లోగానీ, టీవీ 5లోగానీ, ఈటీవీలో గానీ చర్చ జరిగిందా.. ?. ఎందుకు చర్చించలేదు అని టీడీపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు నిలదీయండి అని కోరుతున్నాను. - లోకేష్ అమెరికా వెళ్ళి మహిళలతో ఏరకంగా నిస్సిగ్గుగా ప్రవర్తించాడో.. ఆ ఫోటోలు, వీడియోలపై కూడా ఎల్లో మీడియాలో ఎందుకు చర్చ పెట్టరు అని అడగండి. *బీసీ ఎంపీ కాబట్టి వేధిస్తారా..?* ఒక ఫేక్ వీడియోను, ఒక దొంగ వీడియోను సృష్టించి, దానిపై మీరే చర్చకు పెట్టి, బీసీ ఎంపీ అయిన నన్ను రకరకాలుగా హింస పెట్టడానికి టీడీపీ ప్రయత్నం చేసిందో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులంతా ఆలోచించాలి. ఇది వారి కుల వివక్షతకు, కుల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం కాదా..? - ఒక ఫేక్ వీడియోను పట్టుకుని, ఇన్ని రోజులు కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు.. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోయారు. *చంద్రబాబుకు సవాల్* ఒక బీసీ ఎంపీ అయిన నాపై ఇంత రచ్చ చేసిన చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆ ఆడియో తనది కాదని గానీ, దొరికిన ఆ రూ. 50 లక్షలు తనవి కాదు అని గానీ, ఆ వ్యవహారానికి తనకు ఏ సంబంధం లేదు.. అనిగానీ ఒక హిందువునిగా, వెంకటేశ్వర స్వామి భక్తునిగా, కాణిపాకం వినాయకుడి గుడికి వచ్చి చంద్రబాబు ప్రమాణం చేయగలరా.. అని సవాల్ విసురుతున్నాను. - నేను నాపై వచ్చిన వీడియో మీద ప్రమాణం చేస్తాను. ఓటుకు కోట్లు కేసులో దొరికిన ఆడియో- వీడియో మీది కాదు అని చంద్రబాబు ప్రమాణం చేస్తే.. నా రాజీనామా లేఖను, అక్కడే ఎడమ చేతితో నీ మొహానే పడేసి వెళతాను. దమ్ముంటే ఈ ఛాలెంజ్ కు చంద్రబాబు అంగీకరించాలి. - లేదంటే, నాపై రచ్చ చేసింది ఫేక్ వీడియోతోనే అని, తాను గడ్డి తిన్నాను అని, ముక్కు నేలకు రాసి, చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. - ఇప్పటికైనా, బుద్ధి తెచ్చుకుని, దొంగ రాజకీయాలు, లుచ్ఛా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. జయాపజయాలు దైవాదీనం, జనాదీనం.. కాబట్టి, మీ ఎల్లో మీడియా ఆధీనం కాదన్నది బాబు గుర్తు పెట్టుకోవాలి. - నీకు బలం ఉంటే.. ప్రజా క్షేత్రంలోకి వచ్చి పోరాటం చేయ్... ప్రజా క్షేత్రంలో పోరాడితే.. ఎవరు ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. మీ ఎల్లో టీవీలు, మీ ఎల్లో పేపర్లను అడ్డం పెట్టుకుని, మా పార్టీ మీద బురదచల్లి గెలవలేవన్నది గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. - ఫేక్ వీడియోలను జనంలోకి వదిలి.. కొద్దిరోజులపాటు మీరంతా తాత్కాలిక ఆనందం పొంది ఉంటారు. భారతంలో చూసినా.. రామాయణంలో చూసినా.. చివరిగా గెలిచేది ధర్మమే. అలానే, అంతిమంగా విజేతను నేనే అన్నది చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. *ఫేక్ వీడియోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.* నాపై తయారు చేసిన ఫేక్ వీడియోలు, సర్టిఫికేట్ పై లీగల్ యాక్షన్ కు కూడా వెళ్ళటం జరిగింది. ఈ ఫేక్ వీడియోపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పటికే డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. - అది ఒరిజినల్ కాదు.. అని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెబుతుంటే, అది ఏమిటో.. టీవీ 5, ఏబీఎన్ వాళ్ళే చెప్పాలి. - కురుబలు అంటే లోకేష్ కు ఇంతకాలం లెక్కా జమ లేదు.. ఈ దెబ్బతో, లోకేష్ కు కురుబల బలం ఏమిటో తెలుసుకుని, కంబళి కప్పుకుని పడుకున్నాడని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.