సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ కలిశారు. వారికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ బీఫామ్‌ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నామినేషన్‌ దాఖలు చేసేందుకు రాజ్యసభ అభ్యర్థులు అసెంబ్లీకి బయలుదేరారు.

Back to Top