టీడీపీ అంతిమ దశకు చేరింది

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
 

 

నెల్లూరు: ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయడంలో అగ్రఘణ్యుడు చంద్రబాబు, కానీ చేసిన దోపిడీని నుంచి తప్పించుకోవడానికి తెలివిగా ప్రవర్తిస్తుంటాడు. గత ఐదేళ్లు రాష్ట్ర సంపదనంతా టీడీపీ నేతలకు బాబు దోచిపెట్టాడు. ఐటీ దాడుల్లో దొరికింది చాలా తక్కువ అని, బాబు కోటరీని విచారిస్తే భారీగా సొమ్ము బయటకు వస్తుందన్నారు. సత్యహరిశ్చంద్రుడు అయినట్లుగా దేశ నాయకులందరినీ చంద్రబాబు విమర్శిస్తుంటాడని, ఇంకో ఆరు నెలల్లో బాబు అవినీతి అంతా బయటకు వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంతమయ్యే దశ దగ్గరలోనే ఉందని విమర్శించారు.  

తాజా వీడియోలు

Back to Top