నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమానంగా సాగుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదు అనే వారికి కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనం అన్నారు. రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ పడారుపల్లిలోని చలపతి నగర్ లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చలపతి నగర్ లో 40 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 23వ డివిజన్లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఐదుకోట్ల 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరో కోటి రూపాయల నిధులను కూడా మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, 29వ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, డివిజన్ అధ్యక్షులు పత్తిపాటి పుల్లారెడ్డి, 29వ డివిజన్ నాయకులు యనమల మల్లికార్జున్ రెడ్డి, మూలే బాల వెంగల్ రెడ్డి, బాల నాగేందర్ రెడ్డి, వెంకటరావు, ఆరి మల్ల వెంకటేశ్వర్లు, కోటంరెడ్డి సుదీష్ రెడ్డి, కాకుటూరు శివయ్య, వేమిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మురళి రెడ్డి, విడవలూరు చిన్న, పాలేటి శివ, దావులూరి లోకేష్, బత్తాని శ్రీనివాసులు, బెల్లంకొండ అచ్చిరాజు, ఎన్ ఎస్ నారాయణ, సాలవ కృష్ణ, కొండ నారాయణరెడ్డి, మాజీ కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర్ రెడ్డి, మూలే విజయభాస్కర్ రెడ్డి,సయ్యద్ మొబీన, తాళ్లూరు అవినాష్, కొండేటి నరసింహారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.